విద్యను వ్యాపారంగా మార్చొద్దు: పీడీఎస్యూ

Published on

-Advertisement-

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలి

నారాయణపేట అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మన భారత్ | నారాయణపేట జిల్లా

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర చట్టం రూపొందించి కఠినంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూతో కూడిన ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు నియంత్రణ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చేశాయని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రకరకాల పేర్లతో భారీ మొత్తాల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల భారంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం లభించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై మరింత భారం పడుతోందన్నారు.

కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అదనపు సెక్షన్లు, బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫీజుల దోపిడీపై పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, విద్యను పూర్తిగా వ్యాపార ధోరణి నుంచి బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత, నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

పేద, మధ్యతరగతి ప్రజలు ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల కబంధహస్తాల నుంచి తల్లిదండ్రులను రక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు జె.రాము, పి.మధు, యం.రాజు, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శులు రాజు, నవనీత, శ్రీకాంత్, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన...

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

More like this

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన...

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...