శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Published on

-Advertisement-

మన భారత్,ఆంధ్రప్రదేశ్:

రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిధిలోని కార్యాలయాల్లో 4 ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత పోస్టులను బట్టి పదో తరగతి, డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో రాత పరీక్ష మరియు వైవా వోస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1000గా, SC, ST, PWBD అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు, అర్హతలు తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టుల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

వెబ్‌సైట్: srikakulam.dcourts.gov.in

ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this