రేపు సాయంత్రం నుంచే వైన్సులు బంద్ – తొలి విడత పంచాయతీ పోలింగ్‌తో కఠిన ఆంక్షలు
మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రైడే అమల్లోకి రానున్నది. ఎన్నికల కారణంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు అన్ని వైన్స్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణలో తొలి విడతగా 4,236 గ్రామ పంచాయతీ స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, శాంతి భద్రతలు, ఎన్నికల నిష్పక్షపాతత్వం దృష్ట్యా ఈ డ్రైడే అమలు చేయబడుతోంది.
