💥“రెండేళ్లలో ఏమిచేశారు రేవంత్?” – కిషన్ రెడ్డి సూటి ఛాలెంజ్!
మన భారత్, హైదరాబాద్ : “బీఆర్ఎస్–కాంగ్రెస్‌లకు తేడా లేదు… రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పాలనకు ప్రతీకలు!” అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. టీ–భారత్‌లో పెరిగిన అవినీతి, పెరిగిన అప్పులు, నిలిచిపోయిన అభివృద్ధి—అన్నింటికీ కాంగ్రెస్‌నే బాధ్యులని ఆయన ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన “కాంగ్రెస్ నయవంచన–రెండేళ్ల పాలన” మహా ధర్నాలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
🔴 “బీఆర్ఎస్ అవినీతి → కాంగ్రెస్ అవినీతి పాలన”
కిషన్ రెడ్డి మాట్లాడుతూ—
- తెలంగాణ మిగులు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని,
- 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలను నిరుత్సాహపర్చిందని,
- కేసీఆర్ కుటుంబ పాలన అవినీతికి పరాకాష్టగా మార్చేసిందని,
- ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా ప్రజల ఆవేదనలకు స్పందించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కేసీఆర్ పోయి… రేవంత్ రెడ్డి వచ్చారు. పాలనలో మార్పేమీ లేదు… దోపిడీలో మాత్రం మార్పు లేదు!” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
🔴 “రెండేళ్ల పాలన… హామీలేమయ్యాయి రేవంత్ రెడ్డి?” – కిషన్ రెడ్డి నిలదీత
కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డిపై వరుస ప్రశ్నలు సంధించారు:
- రెండేళ్లలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదెందుకు?
- ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?
- నిరుద్యోగ భృతి ₹4,000 ఎక్కడ?
- వృద్ధులు, వికలాంగులకు పెంచిన పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు?
- బెల్ట్ దుకాణాలు రద్దు చేస్తామన్నారు… ఎందుకు చేయలేదు?
“ప్రజలకు ఇచ్చే సన్న బియ్యం కూడా కేంద్రం పంపుతోంది… కాంగ్రెస్ నేతలు ఏమి చేస్తున్నారు?” అని ఆయన నిలదీశారు.
🔴 “ఫిరాయించిన ఎమ్మెల్యేలకి ఎందుకు రాజీనామాలు తీసుకోలేదు?”
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయించలేని సీఎం రేవంత్ రెడ్డి ఏ నైతికతతో పాలన సాగిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
“హామీలు అమలు చేస్తే… నీతో ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద చర్చకు వచ్చేదానా?” అంటూ కిషన్ రెడ్డి సూటి ఛాలెంజ్ విసిరారు.
🔴 “భూములు అమ్మితేనే రాష్ట్రానికి ఆదాయమా.?”
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
“ప్రభుత్వ భూములు అమ్మకపోతే పూట గడవని స్థితి… ఇదేనా రేవంత్ పాలన?” అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ చేపట్టిన ఈ మహా ధర్నా కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచడమే తమ లక్ష్యమని బీజేపీ నాయకులు తెలిపారు.
