పొన్నారి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ
మన భారత్, పొన్నారి: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గ్రామ ప్రజలు, నాయకులు కలిసి పూలమాలలు వేశారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన సిద్ధాంతాలను అనుసరించాల్సిందిగా నాయకులు పిలుపునిచ్చారు.
గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మలపతి చిన్న, శంకర్, సావంత్ నారాయణ, కొండ రాజన్న, తొగరి నరేష్, ఆటోలి చందు, విలాస్, రామన్న, అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని యువత అనుసరించాలని వ్యాఖ్యానించారు.
