అంబుగామ సర్పంచ్ యశ్వంత్ రావును శాలువాలతో సన్మానిస్తున్న ఆలయ కమిటీ
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పుబాయి యశ్వంత్ రావును ఆలయ కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. గ్రామ అభివృద్ధి, ఆలయ కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భజనలు, మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పట్ల ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని సర్పంచ్ యశ్వంత్ రావు ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల సేవే గొప్ప సేవ అని, సాయి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
