స్థానిక సంస్థల ఎన్నికల వేళ లాల్‌గడ్–లక్ష్మిపూర్ చెక్‌పోస్ట్‌లో తనిఖీలు
మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో భద్రతా చర్యలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం లాల్‌గడ–లక్ష్మిపూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ను రూరల్ సీఐ ఫణిందర్ ఆకస్మికంగా పరిశీలించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ, వ్యక్తుల ప్రయాణ వివరాలు, సరుకు రవాణాపై సమగ్ర పరిశీలన చేపట్టారు.
ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, డబ్బుల పంపిణీ, మద్యం తరలింపు వంటి అనైతిక చర్యలను అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. అంతరాష్ట్ర మార్గాల్లో కఠిన పర్యవేక్షణలో శాంతియుత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని సీఐ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
