e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం…మోదీ

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం… ఐబీఎస్ఏ నాయకులతో ప్రధాని మోదీ చర్చలు

మన భారత్, జొహానెస్బర్గ్ :  జొహానెస్బర్గ్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌లో ఐబీఎస్ఏ (ఇండియా–బ్రెజిల్–సౌత్ ఆఫ్రికా) నాయకుల సమావేశం కీలకంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో విస్తృత చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ, వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలిచే వ్యవసాయ వ్యవస్థల కోసం ‘IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్’ ఏర్పాటు అత్యవసరం అని స్పష్టం చేశారు. డిజిటల్ రంగంలో అభివృద్ధి, సాంకేతిక వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ప్ ప్రాముఖ్యత ను కూడా వివరించారు.

విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఐబీఎస్ఏ ఇప్పటికే 40కి పైగా దేశాలకు అందిస్తున్న మద్దతు ప్రశంసనీయం అని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐబీఎస్ఏ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జి20 వేదికగా జరిగిన ఈ సమావేశం దక్షిణ గోళార్ధ దేశాల సహకారానికి కొత్త దిశగా భావిస్తున్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE