కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఆశలు నిరాశలు
అధిష్టానం నిర్ణయంతో జిల్లాల్లో నేతల్లో చర్చల దుమారం
మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ అధిష్టానం తాజా ప్రకటనతో నాలుగు జిల్లాల్లో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్, కుమ్రం భీం–ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా అత్రం సుగుణ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రఘునాథ్‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ నియామకాలు వెలువడడం తో ఆశావహులలో నిరాశ వెల్లివిరిసింది. ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నేత శ్రీకాంత్‌రెడ్డి, గోక గణేష్ రెడ్డి తో పాటు పలువురు నాయకులకు ఈసారి అధిష్టానం అవకాశాన్ని ఇవ్వలేదు.
నిర్మల్ జిల్లాలో శ్రీహరి రావు, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, నారాయణరావు పటేల్ తదితరులు పోటీలో ఉన్నప్పటికీ, చివరకు వెడ్మ బొజ్జుకే ఎంపిక దక్కింది.
మంచిర్యాల, కుమ్రం భీం–ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా డీసీసీ పదవిని ఆశించిన పలువురికి నిరాశే ఎదురైంది.
పదవి రాని నేతలు తమ తదుపరి రాజకీయ నిర్ణయాలపై ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే దానిపై జిల్లాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వంపై ఈ నియామకాల ప్రభావం ఎలా ఉంటుందో ఆసక్తిగా మారింది.
