9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం రథోత్సవం..

Published on

📰 Generate e-Paper Clip

9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం రథోత్సవం… పుట్టపర్తిలో శత జయంతి ఉత్సవాల ఘన శ్రీకారం

పుట్టపర్తి, మన భారత్ : సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక వైభవానికి నెలవైన ప్రశాంతి నిలయం భక్తజన సంద్రంతో కళకళలాడింది. నిన్న ప్రారంభమైన వేడుకల్లో భాగంగా **9.2 కేజీల శుద్ధ బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంపై భవ్యంగా ఊరేగించారు.** పట్టణం అంతా భక్తులతో నిండిపోయి, రథం వెళ్లిన ప్రతి చోట హర్షధ్వానాలు మార్మోగాయి.

ప్రశాంతి నిలయంలో జరిగిన ‘సురంజలి’ సంగీత కార్యక్రమం భక్తులను భక్తిరసం లోకంలో తేలియాడేలా చేసింది. ప్రముఖ సంగీత కళాకారుల స్వరాలు పుట్టపర్తిని మరింత ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి.

జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, క్రీడా ప్రపంచం నుంచి సచిన్ టెండూల్కర్, సినీ ప్రపంచం నుంచి ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. వారి రాకతో పుట్టపర్తి మరోసారి జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది.

సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చర్చలు, సాంప్రదాయ కళా సంస్కృతులు ప్రదర్శనలు శత జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this