e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం శ్రీకారం..

ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం… రాష్ట్రవ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరలు

మన భారత్, హైదరాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం భారీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే మహా ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద లాంఛనంగా శుభారంభం చేయనున్నారు.

మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి అర్హ మహిళకు నాణ్యమైన చీరను అందించాలనే ఉద్దేశంతో చీరలన్నీ సిరిసిల్ల చేనేత కార్మికులతో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి కొంత ఆలస్యం అవుతుండటంతో పంపిణీని రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు.

రెండు దశల్లో పంపిణీ

🔹 మొదటి దశ: ఇందిరా గాంధీ జయంతి (నవంబర్ 19) నుంచి డిసెంబర్ 9 (తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం) వరకు — గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
🔹 రెండో దశ: మార్చి 1 నుండి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు — పట్టణ ప్రాంతాల్లో పంపిణీ నిర్వహించనున్నారు.

నాణ్యతపై రాజీపడొద్దు: సీఎం ఆదేశాలు

చీరల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. సాంకేతిక సహాయంతో పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోని అధికారులు పంపిణీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM కార్యక్రమ వివరాలు

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం సీఎం రేవంత్ చీరల పంపిణీని ప్రారంభిస్తారు. ఆపై సెక్రటేరియట్ నుండి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి జిల్లాల కలెక్టరేట్ల వద్ద నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని సూచించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయం అని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE