రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన APSDMA
మన భారత్, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వాతావరణం మారుస్తోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు వివరించింది. తీర ప్రాంతాల్లో గాలులు వేగం పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని APSDMA సూచించింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
అల్పపీడనం ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, వర్షపాత తీవ్రత మార్పులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు సలహా ఇచ్చింది.
#APWeather #RainAlert #APSDMA #Nellore #Tirupati #HeavyRains #ManaBharathCom
