42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు.?

Published on

-Advertisement-

పార్టీ ఆధారంగా 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు? కాంగ్రెస్ కీలక నిర్ణయానికి రంగం సిద్ధం

మన భారత్ , హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీ ఓటర్ల శక్తి, రాజకీయ ప్రభావం దృష్ట్యా రిజర్వేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆలోచన పార్టీ నాయకత్వంలో నెలకొంది. అయితే చట్టపరమైన రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కొనసాగుతుండటం, సంబంధిత బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కౌన్సిల్ ఆమోదం లేకపోవడం వంటి అంశాల నేపథ్యంతో పార్టీ ఆధారంగానే రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం బలపడుతోంది.

ఈ నేపథ్యంలో రేపు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరగనుందని, తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరమైన రిజర్వేషన్లు అమలులోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ రాజకీయ ప్రభావాన్ని చూపే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం.

#BCReservations #42PercentQuota #TelanganaPolitics #CongressGovernment #LocalBodyElections #PoliticalNews #ManaBharathCom

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this