బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన వివరాలు..

Published on

📰 Generate e-Paper Clip

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రేపు పలు మండలాల్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్ | నవంబర్ 2: బోథ్ నియోజకవర్గ ప్రజల వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని  ఎమ్మెల్యే అనిల్ జాదవ్  (సోమవారం, నవంబర్ 3) పలు మండలాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులకు సకాలంలో పంట కొనుగోలు సదుపాయం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం 10.00 గంటలకు నేరడిగొండ మండల కేంద్రంలో మొక్కజొన్న , సోయాబీన్ కొనుగోలు కేంద్రం, ఉదయం 10.30 గంటలకు బోథ్ మండల కేంద్రంలో, 11.10 గంటలకు ఇచ్చోడ మండలంలో సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.

తరువాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివాహ శుభకార్యాలలో పాల్గొని రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తాంసి మండల కేంద్రంలో, 2.00 గంటలకు భీంపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్‌లో, 3.00 గంటలకు తలమడగు మండల కేంద్రంలో నూతన ఫంక్షన్ హాల్ ను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు భారీగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Latest articles

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

More like this