బండల్‌నాగాపూర్ అంగన్వాడీ లో ఆరోగ్య అవగాహన సెషన్ నిర్వహణ
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని బండల్ నాగాపూర్ (అంగన్వాడీ ) అప్‌పర్ ప్రైమరీ పాఠశాలలో ఈ రోజు ఆరోగ్య అవగాహన సెషన్ విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజల్లో ఆరోగ్య సదుపాయాల వినియోగం, శుభ్రత, పోషకాహారం, మరియు వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ రాథోడ్ తులసిరాం, ఏఎన్‌ఎమ్ ప్రమీల, ఆశా వర్కర్ సారదా, అంగన్‌వాడీ టీచర్ వనిత పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆరోగ్య సూచనలు అందించారు. వారు స్వచ్ఛత, పోషకాహారం, తాగునీటి ప్రాముఖ్యత, టీకాల అవసరం వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు, స్థానికులు ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థులు ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే ప్రజల్లో ఆరోగ్య చైతన్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
