తేమ శాతం పేరుతో రైతులను దోచుకుంటున్న ప్రభుత్వాలు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:“ రైతులను దోచుకోవడం తప్ప ప్రభుత్వాలకు వేరే పనిలేదు” అని భారతీయ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూమా రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాంసి మండల కేంద్రంలో భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడుతూ, “సీసీఐ సంస్థలు పత్తి కొనుగోళ్లలో రైతులను నష్టపరుస్తున్నాయి. తేమ శాతం పేరుతో పత్తి బేళ్లను తిరస్కరించడం అన్యాయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కనీసం 18 శాతం తేమతో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

రైతులు ఎండవానల మధ్య కష్టపడి పంటను పండిస్తే, ప్రభుత్వ విధానాల కారణంగా వారికి న్యాయం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు ప్రమాణాలను మార్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కేతి రెడ్డి కృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి అడేపు శ్రీనివాస్, తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఇతర రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Latest articles

మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్

రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

More like this