ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా.!

Published on

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది, ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది, మద్యం షాపుల డ్రా ప్రక్రియ సోమవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 షాపులకు అధికారులు, కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా తీశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో 179 మద్యం షాపులకు డ్రా ముగిసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైన్స్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం షాపు లు దక్కించుకునేందుకు కొందరు సిండికేటై టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుండటంతో యువకు లు, వ్యాపారులు మద్యం వ్యాపారంపై పలువురు కన్నేశారు. పలుచోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కవగా దరఖాస్తులు వేశా రు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణం గా దరఖాస్తులు తగ్గినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజు పెట్టిన విషయం తెలిసిందే. ఎంపికైన దరఖాస్తు దారులు అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్, అనే వ్యక్తికి ఏకంగా మూడు వైన్ షాపులు 1,3,8, లాటరీ ద్వారా దక్కాయి.

– మన భారత్, స్టేట్ బ్యూరో.

Latest articles

పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..

దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా...

కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం..

గ్రామాభివృద్ధే ధ్యేయం.. కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి...

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

More like this