విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ – పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట: జిల్లాలోని దామరగిద్ద మండలంలోని మల్రెడ్డిపల్లి, లోకుర్తి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని పి.డి.ఎస్*.యు (ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడు ఎస్. సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్‌కి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా నాయకులు సాయికుమార్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా బస్సు రాకపోవడంతో మల్రెడ్డిపల్లి, లోకుర్తి గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దామరగిద్ద, నారాయణపేట కాలేజీలకు, పాఠశాలలకు కాలినడకన ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. “రోజూ విద్యార్థులు రెండు క్లాసులు మిస్ అయ్యే వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది గ్రామీణ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది,” అని అన్నారు.

విద్యార్థుల సమస్యలను ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, రహదారుల ఇరువైపులా చెట్లు విస్తరించి ఉండటంతో బస్సులు డ్యామేజ్ అవుతున్నాయని, చెట్లను తొలగిస్తే బస్సు సేవలు తిరిగి ప్రారంభిస్తామని డిఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా కోశాధికారి మహేష్, నాయకులు నరేష్, కార్తీక్, శ్రీశాంత్, శిరీష, అనిత, అపర్ణ, నవిత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు నేతలు ఆర్టీసీ అధికారులను కోరారు.

Latest articles

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

More like this