తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి
మన భారత్, తాంసి:
తాంసీ మండల కేంద్రంలో మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉప సర్పంచ్‌ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఆత్రం ఇంద్రదేవ్, అధ్యక్షులుగా మంత్రి గంగా రెడ్డి, ఉప అధ్యక్షులుగా మేశ్రం గణేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చింతలపల్లి రాంరెడ్డి, కోశాధికారిగా ఆత్రం భరత్ బాధ్యతలు స్వీకరించారు.
కార్యదర్శులుగా కమరి రమాకాంత్, కుంర అజయ్, బోయిని అనూషలను ఎన్నుకున్నారు. సలహాదారులుగా బారే నర్సింలు, అలారే నర్సింలును నియమించారు. కమిటీ సభ్యులుగా నర్లే సుశీల, మాడవి భుజంగ్ రావు, నిమ్లా మలయ్య, నరేష్ యాదవ్‌లను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌ల ఐక్యతను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
