e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

కూతురిని తీసుకొస్తూ ప్రమాదం.. తండ్రి మృతి

మన భారత్, ఆదిలాబాద్ (నేరడిగొండ):
జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూతురిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్న తండ్రి ప్రమాదంలో మృతి చెందగా, బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

స్థానికుల వివరాల ప్రకారం, ఆరెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిరామ్ బుగ్గరాం పాఠశాలలో చదువుతున్న తన కూతురిని వేసవి సెలవుల కారణంగా స్వగ్రామానికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు తరలిస్తున్న మార్గమధ్యంలో జ్యోతిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE