e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఉగాది శుభాకాంక్షలు: ‘మన భారత్’ రిపోర్టర్ ప్రసాద్

మన భారత్, ఆదిలాబాద్:

తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపరలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన ఉగాది సందర్భంగా ‘మన భారత్’Leading News Portal న్యూస్ పేపర్ తరఫున పాఠకులకు, ప్రకటన కర్తలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. సమాజంలో సౌహార్దత, ఐక్యత పెంపొందాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మన భారత్’ న్యూస్ పేపర్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, నిజాయితీతో కూడిన వార్తలను అందించడంలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠకుల ఆదరణతోనే పత్రిక ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, అందరికీ శుభమస్తు కలగాలని మన భారత్ రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్ ఆకాంక్షించారు.


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE