సూర్యగూడలో క్రికెట్ ఫైనల్ సందడి.. జడ్పీటీసీ అభ్యర్థి రోహిత్

Published on

మన భారత్ ,ఆదిలాబాద్:

గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ ఆశావహ ZPTC అభ్యర్థి ఉర్వేత్త రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో జరిగే క్రీడా పోటీలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

టోర్నమెంట్‌లో విజేతలకు ఉర్వేత్త రోహిత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యగూడ సర్పంచ్ షైక్ రహీమ్, ఉమ్రీ సర్పంచ్ అర్క భరత్, గ్రామ పెద్దలు పటేల్, దేవారి, మహాజన్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పోటీలు తరచూ నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Latest articles

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

మన భారత్, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో Bharatiya Janata Party (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 9...

ఘనంగా లోక భూమరెడ్డి జన్మదిన వేడుకలు..

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని...

మరో ఐదు S-400 కొనేందుకు ఇండియా ప్లాన్!

మన భారత్, న్యూఢిల్లీ:  దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం....

నేడే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు కనిపిస్తందో తెలుసా.?

మన భారత్, న్యూఢిల్లీ:  ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు...

More like this