విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు

Published on

మన భారత్ తెలంగాణ: 

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) తాజా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించగా, అధిక శాతం కాలేజీలకు గతంలో అమలులో ఉన్న ఫీజులనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం సుమారు 10 నుంచి 15 కళాశాలల్లో పాత ఫీజులపై కోత విధించినట్లు సమాచారం. అదే సమయంలో 20 లోపు కళాశాలలకు 10 నుండి 15 శాతం వరకు స్వల్ప పెంపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ఫీజు నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక జీవో విడుదల కానుంది.

2025-28 బ్లాక్ పీరియడ్‌కు ఈ ఫీజు నిర్మాణం వర్తించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this