విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు
మన భారత్ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) తాజా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించగా, అధిక శాతం కాలేజీలకు గతంలో అమలులో ఉన్న ఫీజులనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం సుమారు 10 నుంచి 15 కళాశాలల్లో పాత ఫీజులపై కోత విధించినట్లు సమాచారం. అదే సమయంలో 20 లోపు కళాశాలలకు...