రూ.1,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం

Published on

-Advertisement-

మన భారత్ తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా రూ.1,000 కోట్ల వ్యయంతో మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ మరియు ఓవర్ హాలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతులు, సాంకేతిక పరీక్షలు మరియు నిర్వహణ పనులు ఒకే చోట నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఈ మెగా ఫ్రైట్ ఓవర్ హాలింగ్ స్టేషన్‌ను వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో ఇదే తొలి మెగా ఫ్రైట్ రిపేర్ కేంద్రం కావడం విశేషం. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రైల్వే రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. గూడ్స్ రవాణా వేగవంతం కావడంతో పరిశ్రమలకు, వ్యాపార రంగానికి కూడా మేలు కలుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, ఆధునీకరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this