గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Published on

మన భారత్, తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తొలి విడతగా రూ.259.36 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది.

కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరిని అందించనున్నాయి.

రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచ్‌లు ఉన్న పంచాయతీలకే నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. తాజాగా ఎన్నికలు పూర్తవడంతో ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.

పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా వంటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this