ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు.. 10 గ్రాములు రూ.1.85 లక్షలు

Published on

మన భారత్, హైదరాబాద్:

పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి.

తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,85,000ను దాటింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా ఎగబాకడంతో కొనుగోలుదారులు, ఆభరణాల వ్యాపారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు పసిడిపై దృష్టి పెట్టడం, అలాగే డాలర్ బలహీనత వంటి అంశాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరల్లో స్థిరత్వం కంటే ఒడిదుడుకులే ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ధరలు భారీగా పెరగడంతో సాధారణ కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం దీర్ఘకాల లాభాల దృష్ట్యా ఆసక్తి చూపుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest articles

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...

More like this