నాగోబా మహా పూజలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

మన భారత్ ఆదిలాబాద్:  ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన ఆదివాసుల ఆరాధ్యదైవమైన శ్రీ నాగోబా దేవత ఆలయంలో నిర్వహించిన మహా పూజ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నాగోబా జాతర సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్న ఆయన, మెస్రం వంశీయుల సంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

మహా పూజ అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసియాలోనే రెండవ అతి పెద్ద గిరిజన జాతర మన ఆదిలాబాద్ జిల్లాలో జరగడం జిల్లావాసులకు గర్వకారణమని అన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతూ రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

నాగోబా జాతర గిరిజన సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ పవిత్ర సంప్రదాయాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతర విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులు, అధికారులు అభినందనీయులని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల్ గౌడ్, ముండే పాండరంగ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నాగోబా మహా పూజ సందర్భంగా కేస్లాపూర్ గ్రామం భక్తులతో కిటకిటలాడింది.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this