బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం

Published on

మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని స్పష్టం చేస్తూ, ఏ కూటమితోనూ కలిసి వెళ్లే ప్రశ్నే లేదని అకోట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎంఐఎం బలంగా ఎదిగిందని ఒవైసీ పేర్కొన్నారు. “మహారాష్ట్రలో 125 మంది కార్పొరేటర్లను మా పార్టీ టికెట్‌పై గెలిపించుకున్నాం. ఇందులో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారు. ఇది మా పార్టీపై అన్ని వర్గాల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం” అని అన్నారు.

ఎన్నికల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఓటర్ల జాబితా విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, జాబితాలను తాము స్వయంగా పరిశీలించి వెరిఫై చేశామని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలు, మైనారిటీల హక్కుల పరిరక్షణే ఎంఐఎం ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

భవిష్యత్ రాజకీయాల్లో సిద్ధాంతాల ఆధారంగానే ముందుకు వెళ్తామని, అవకాశవాద రాజకీయాలకు తాము దూరమని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు అనే ప్రచారానికి ఇకపై తావులేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this