మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..

Published on

మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన సవాలును స్వీకరించే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. పేదల కోసం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణాల ప్రగతే తమ అజెండా అని అన్నారు. మాటల రాజకీయాలు కాకుండా పనితోనే ప్రజల మద్దతు సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవిగా ఉంటాయని పేర్కొంటూ, ప్రజల తీర్పుతోనే అభివృద్ధికి కొత్త దిశ చూపుతామని అన్నారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this