బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బోండ్ల వెంకటస్వామి..

Published on

నూతన జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బోండ్ల వెంకటస్వామి నియామకం

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూర్చేలా నూతనంగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా శ్రీ బోండ్ల వెంకటస్వామిని పార్టీ అధిష్ఠానం నియమించింది. చిన్ననాటి నుంచే హిందుత్వ భావజాలంతో ప్రేరణ పొందిన ఆయన, 8వ తరగతి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి సేవలందిస్తున్నారు.

పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, కార్యకర్తలతో మమేకమయ్యే తీరు, క్షేత్రస్థాయిలో చేసిన సేవలను గుర్తించి జిల్లా బీజేపీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బోండ్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు ఎంపీ శ్రీ గోడం నగేష్ కి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి బ్రహ్మానందంకి, కనపర్తి చంద్రకాంత్ కు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయంతో ప్రజాసేవను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ నియామకంతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకలాపాలకు కొత్త ఉత్సాహం ఏర్పడిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this