మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

Published on

మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఘన ఆహ్వానం.. అసెంబ్లీలో జాతర పోస్టర్ ఆవిష్కరణ

మన భారత్, తెలంగాణ : ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కి అందజేశారు. అనంతరం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి  అధికారికంగా ఆవిష్కరించారు. ఈ మహాజాతర ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, కోట్లాది మంది భక్తుల ఆరాధనకు కేంద్రంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం మహాజాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని సీఎం వెల్లడించారు. జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this