ఇంట్లో ఈ వస్తువులు యమ డేంజర్.!

Published on

-Advertisement-

ఇంట్లోనే ఉన్న ఈ వస్తువులు యమ డేంజర్!

– తెలియకనే ఇన్ఫెక్షన్లకు ఆహ్వానం

మన భారత్, న్యూఢిల్లీ:  మన ఇళ్లు శుభ్రంగా ఉన్నాయని భావించినా, రోజూ వాడే కొన్ని వస్తువులే ప్రమాదకరమైన బ్యాక్టీరియా, క్రిములకు అసలైన నిలయాలుగా మారుతున్నాయని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. బయట పబ్లిక్ టాయ్లెట్ సీట్ల కంటే కూడా మనం తరచూ తాకే వస్తువులపై ఎక్కువగా క్రిములు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సూపర్ మార్కెట్ ట్రాలీలు, ఏటీఎం బటన్లు, లిఫ్ట్ బటన్లపై పబ్లిక్ టాయ్లెట్ సీటుతో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. వందల మంది ఒకే వస్తువులను తాకడం వల్ల ఇవి ఇన్ఫెక్షన్లకు హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి.

ఇక రోజూ చేతిలో ఉండే మొబైల్ ఫోన్లు, కార్యాలయాల్లో వాడే కీబోర్డులు, ఇంట్లో టీవీ రిమోట్లు, వంటగదిలో ఉపయోగించే స్పాంజ్లు కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిపై చేరే క్రిములు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి జలుబు నుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వరకు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్య నిపుణుల అంచనా ప్రకారం, రోజూ మనం తాకే వస్తువుల ద్వారానే దాదాపు 80 శాతం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అయినప్పటికీ, ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది.

అందుకే ఇలాంటి వస్తువులు వాడిన ప్రతిసారి చేతులను సబ్బుతో కడగడం లేదా శానిటైజర్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్లు, రిమోట్లు, కీబోర్డులు వంటి వాటిని తరచూ శుభ్రపరచడం ద్వారా ఇన్ఫెక్షన్ల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...