జనవరి 7 వరకే అసెంబ్లీ సమావేశాలు..

Published on

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలను జనవరి 7 వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4న (ఆదివారం) సెలవు ఉండనుంది.

అయితే, అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలంటే తక్కువ రోజులు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

కొత్త సంవత్సరంలో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, హామీల అమలుపై చర్చలు కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this