దత్తు అఫీషియల్ “మండల దీక్షగొని” పాట ఆవిష్కరణ

Published on

 బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయంలో ‘మండల దీక్షగొని’ సీడి ఘనంగా ఆవిష్కరణ

మన భారత్, ఆదిలాబాద్:
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయ ప్రాంగణంలోమండల దీక్షగొని’ అనే భక్తి గీతాల సీడీని ఘనంగా ఆవిష్కరించారు. కప్పర్ల సన్నిధానం గురుస్వాములు భారె నాగేష్, కౌడాల మధుకర్ గురుస్వాముల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బెల్లూరి ఆలయ అధ్యక్షులు చంద గణేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం గురుస్వామి, కోశాధికారి గౌరు లక్ష్మణ్ గురుస్వామి పాల్గొని సీడీని ఆవిష్కరించారు.

అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘మండల దీక్షగొని’ సీడీ భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణనిచ్చే విధంగా రూపొందించబడిందని గురుస్వాములు తెలిపారు. దీక్షా కాలంలో స్వాములు పాటించాల్సిన నియమాలు, భక్తి భావన ఈ గీతాల ద్వారా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఈ భక్తి గీతాల సీడీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు “Dattu Official” అనే యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి, ఆలకించాలని వారు కోరారు.

ఆధ్యాత్మిక సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాల్గొన్న గురుస్వాములు అభిప్రాయపడ్డారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this