అంబుగాం సర్పంచ్ ఆత్రం భరత్‌కు ఘన సత్కారం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని అంబుగాం గ్రామ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్రం భరత్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి తో కలిసి ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో ఎన్నికైన ఉప సర్పంచ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గ్రామస్థాయి నాయకులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉప సర్పంచ్ ఆత్రం భరత్ మాట్లాడుతూ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో అంబుగాం గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని నూతన ఉప సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
