మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని సకినాపూర్ గ్రామంలో ప్రత్యేక వాతావరణంలో ప్రజాస్వామ్య పండుగను గ్రామస్తులు వీక్షించారు. గ్రామానికి ఆనవాయితీగా నిలిచిన మర్రి చెట్టు నీడలో నూతన సర్పంచ్‌గా మేస్త్రం నికిత నగేష్, వార్డ్ సభ్యులతో కలిసి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. సాదాసీదా వాతావరణంలో, గ్రామీణ సంప్రదాయాలకు అద్దం పడుతూ జరిగిన ఈ కార్యక్రమం స్థానికుల్లో విశేష ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా సర్పంచ్ నికిత నగేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో సకినాపూర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

అనంతరం గ్రామస్తులు సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏవో కీర్తి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, పటేల్ కుమ్రం మాణిక్ రావు, మేస్త్రం మాధవరావు, కుమ్ర హనుమాండ్లు, మేస్త్రం షంభూ పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్‌గా అత్రం సంతోష్‌తో పాటు గేడం నీల, మేస్తం శకుంత, కొడప బాపురావు, మడావి రమేష్ తదితరులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
