కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్
మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్సికే గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా సలాం రఘునాథ్ మాట్లాడుతూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి పల్సికే గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సహకరించాలని సలాం రఘునాథ్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం ఏకతాటిపై నిలబడి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటే పల్సికే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
