సర్పంచ్ ఈశ్వర్ ను సన్మానించిన ఎమ్మెల్యే..

Published on

-Advertisement-

లక్కీ డ్రాతో సర్పంచ్ పీఠం.. ఈశ్వర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్:ఇచ్చోడ మండలంలోని దాబ (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా లక్కీ డ్రా తో ఎన్నికైన ఈశ్వర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించారు. ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం ఈశ్వర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈశ్వర్‌కు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శక పాలన, అభివృద్ధి పనుల్లో వేగం తీసుకురావాలని ఆకాంక్షించారు.

సర్పంచ్ ఈశ్వర్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this