లక్కీ డ్రాతో సర్పంచ్ పీఠం.. ఈశ్వర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందనలు
మన భారత్, ఆదిలాబాద్:ఇచ్చోడ మండలంలోని దాబ (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా లక్కీ డ్రా తో ఎన్నికైన ఈశ్వర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించారు. ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం ఈశ్వర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈశ్వర్‌కు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శక పాలన, అభివృద్ధి పనుల్లో వేగం తీసుకురావాలని ఆకాంక్షించారు.
సర్పంచ్ ఈశ్వర్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
