💥 ఒక్క ఓటుతో విజయం… తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు!
మన భారత్, తెలంగాణ:తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. పలువురు సర్పంచ్ అభ్యర్థుల భవిష్యత్తు ఒక్క ఓటుపై నిలవడంతో గ్రామాలు కాసేపు టెన్షన్‌తో కోలాహలంగా మారాయి.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం నడిమితండాలో సర్పంచ్ పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ తన ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించి రాజకీయ రంగంలో చర్చనీయాంశమయ్యారు.
అదే విధంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మర్రికుంట తండాలో INC మద్దతు ఉన్న బానోత్ రోజా కూడా ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రెండు గ్రామాల్లోనూ ఒక్క ఓటు వేలెత్తడంతో చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రా పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు చీటీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయించారు. పారుపల్లి గ్రామంలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజయ్య అదృష్టం తోడై విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు టెన్షన్‌తో నిండినప్పటికీ ప్రజాస్వామ్య స్పూర్తిని మరోసారి ఈ గ్రామాలు నిలబెట్టాయి.
