పల్సి(బీ) గ్రామంలో ఏకగ్రీవ విజయం..

Published on

📰 Generate e-Paper Clip

పల్సిబి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ విజయం: సర్పంచ్‌గా నైతం లక్ష్మణ్, ఉపసర్పంచ్‌గా నైతం రామచందర్

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్సిబి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా గ్రామస్తులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ పదవికి నైతం లక్ష్మణ్‌ను, ఉపసర్పంచ్‌గా నైతం రామచందర్‌ను ఒకే గొంతుతో ఎన్నిక చేశారు. ఎలాంటి ప్రత్యర్థులు లేని పరిస్థితిలో గ్రామ ప్రజలు ఐక్యంగా ఈ ఇద్దరిని నేతృత్వానికి ముందుంచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నైతం లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిని తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యా సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలలో తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ రామచందర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఇంటికి చేరువగా ప్రజా పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

గ్రామస్తులు మాట్లాడుతూ శాంతి, ఐక్యంతో నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరమని, నూతన నాయకత్వం గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this