💥ఎన్నికల వేలంపాట చట్టరీత్యా నేరం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
మన భారత్, తాంసి ,డిసెంబర్ 7: గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎవరి ప్రభావం లేకుండా, ఎలాంటి వేలంపాటలు లేకుండా పూర్తిగా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్, తాంసి మండలాల్లోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలైన – చాందా టి, జందాపూర్, కప్పర్ల గ్రామాలను సందర్శించిన ఆయన ప్రజలకు కీలక సూచనలు చేశారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, “ఓటు హక్కు పవిత్రమైనది… ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ఎవరి బలవంతం, ప్రలోభాలకు లోనవకండి. ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహిస్తే ఇది చట్టరీత్యా నేరం. కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.
ఎస్పీ సూచనలు – ప్రజలకు స్పష్టం చేసిన అంశాలు
* క్రయవిక్రయ రాజకీయాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వవద్దని స్పష్టం
* ఎన్నికల్లో వీడీసీ జోక్యాన్ని పూర్తిగా నిషేధం
* సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులకు పోలీసులు కఠిన చర్యలు
* యువత ఆవేశానికి లోనవకుండా శాంతి భద్రతలను కాపాడాలని పిలుపు
* పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీ., 200 మీ. పరిధిలో నియమాలు తప్పనిసరి
* అల్లర్లు, గొడవలు ఎక్కడైనా కనిపిస్తే డయల్ 100 ద్వారా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచన
* ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం
* టపాకాయలు, బహుమతులు, మద్యం పంపిణీ – చట్టపరమైన నేరమని స్పష్టం
* సమావేశాలు, ప్రచారాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
ఫ్లాగ్ మార్చ్‌తో నమ్మకం పెంచిన పోలీసులు
చాందా టి, జందాపూర్, కప్పర్ల గ్రామాల్లో స్పెషల్ పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని పెంపొందించారు. సమస్యలు సృష్టించే వారిపై బైండోవర్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె. ఫణిదర్, ఎస్సైలు వి. విష్ణువర్ధన్, డి. రాధిక, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
