✈️ఇండిగో సంక్షోభం మధ్య భారీ ఉపశమనం – సాయంత్రంలోపు 1,500 ఫ్లైట్లు నడుస్తాయి
మన భారత్ | National Aviation Desk, హైదరాబాద్:
ఇండిగో విమానయాన సంస్థను పట్టిపీడిస్తున్న సంక్షోభం ఆదివారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా వందకు పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్ సహా అనేక ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల క్యూ లు అంతకంతకు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది.
🔵 సాయంత్రంలోపు 1,500 విమానాలు నడుపుతామని ఇండిగో హామీ
ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రయాణీకులకి ఊరటనిచ్చేలా ఇండిగో తాజా ప్రకటన చేసింది.
- 95% నెట్‌వర్క్ కనెక్టివిటీ పునరుద్ధరించాం
- దేశవ్యాప్తంగా 135 ఎయిర్‌పోర్టుల్లో ఆపరేషన్లు కొనసాగుతున్నాయి
- ఈ సాయంత్రం లోపే 1,500 విమాన సర్వీసులు నార్మల్‌గా నడుస్తాయి
సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులకు ఇండిగో మరోసారి క్షమాపణలు తెలియజేసింది. ప్రయాణీకుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది.
🔴 శంషాబాద్‌లో 144 ఇండిగో విమానాల రద్దు – గందరగోళం కొనసాగుతోంది
హైదరాబాద్‌లోని RGIAలో ఇండిగో రద్దు చేసిన ఫ్లైట్ల సంఖ్య భారీగా ఉండటంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదు.
- రావాల్సిన 70 విమానాలు రద్దు
- వెళ్లాల్సిన 74 విమానాలు రద్దు
- మొత్తం 144 సర్వీసులు రద్దు
ఇండిగో కౌంటర్ల వద్ద ప్రయాణీకుల పెనుగులాట కొనసాగుతోంది. టికెట్లు రద్దైన వారికి రీఫండ్ ప్రక్రియ జరగగా, మరికొందరిని ఇతర విమానాల్లో సర్దుబాటు చేస్తున్నారు.
🟡 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు — స్పైస్ జెట్ నుండి రైళ్లు, బస్సుల వరకూ
ఇండిగో సంక్షోభం దృష్ట్యా ఇతర సంస్థలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.
- స్పైస్‌జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది
- ముంబై, ఢిల్లీ, పూణే, హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
- చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖల వరకు ప్రత్యేక బస్సులు
అయినా అయోమయం పూర్తిగా తగ్గలేదనేది వాస్తవం. ఫ్లైట్ రద్దుతో భారీ నష్టపోయిన ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
