ఫుట్‌బాల్ గుర్తుకు ఆశీర్వాదం ఇవ్వండి: సర్పంచ్ అభ్యర్థి రత్న ప్రకాష్ కృష్ణ విజ్ఞప్తి
మన భారత్, తాంసి: తాంసి గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అందరూ ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి రత్న ప్రకాష్ కృష్ణ గ్రామ ప్రజలను కోరారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న ఆయన, మంచి పాలన, పారదర్శకత, గ్రామాభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు.

తాంసిలో పెండింగ్‌లో ఉన్న రహదారులు, తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ, మహిళా యువత అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు సమిష్టిగా సహకరిస్తే తాంసిని అభివృద్ధి మోడల్‌గా మార్చే నిబద్ధత తనకుందని చెప్పారు.
