యువ నేత కేమ శ్రీకాంత్ ను సన్మానిస్తున్న ఆలయ కమిటీ
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో బీఆర్ఎస్ యువ నేత కేంమమ శ్రీకాంత్ కు ఘన సన్మానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యువ నాయకుడు కేమ శ్రీకాంత్ ను శాలువా కప్పి సత్కరించారు. స్థానిక అభివృద్ధికి, యువతలో సేవాభావం పెంచడంలో శ్రీకాంత్ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.
కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు రాం కిషన్ పాల్గొన్నారు.
