జామిడి సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్ దాఖలు..

Published on

జామిడిలో బీఆర్ఎస్ జోరు… సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని జామిడి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేడెక్కుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అశోక్ సోమవారం కప్పర్ల నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఆయన అనుచరులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించారు.

నామినేషన్ అనంతరం యువ నాయకుడు అశోక్ మాట్లాడుతూ… “గ్రామ అభివృద్ధే మా లక్ష్యం. మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారి సదుపాయాల మెరుగుదల, పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు— ప్రతి రంగంలో ప్రజల కోసం పనిచేస్తా. గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటే జామిడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా” అని పేర్కొన్నారు.

అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ పాల్గొని అశోక్‌కు మద్దతు తెలిపారు. జామిడి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా నిలవడం, సర్పంచ్ పోటీకి పొత్తుల బలం చేకూర్చిందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Latest articles

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్...

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

More like this