కప్పర్లలో యువత చూపు.. సర్పంచ్ అభ్యర్థి అరుణ్ వైపు
మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో రాజకీయ వేడి చురుగ్గా కొనసాగుతోంది. గ్రామ యువనేత గండ్రత్ అరుణ్ సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామ యువత దృష్టి ఆయన వైపుకు మళ్లింది.
నామినేషన్ అనంతరం గండ్రత్ అరుణ్ మాట్లాడుతూ… “గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, యువత సాధికారత మా లక్ష్యాలు. ఆలోచించి ఓటు వేసి గ్రామ భవిష్యత్తు తీర్చిదిద్దాలి”అని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
అభ్యర్థితో పాటు నాయకులు కౌడాల నారాయణ, సంతోష్ పాల్గొన్నారు. గ్రామంలో యువత మద్దతు అరుణ్ వైపు సంఘటితం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మండలంలోని 14 గ్రామపంచాయతీలో సోమవారం నాటికి సర్పంచ్ 31, వార్డ్ సభ్యులు 69 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
