కప్పర్లలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సోమవారం సర్పంచ్ పదవితో పాటు వార్డ్ సభ్యుల నామినేషన్ దాఖలు చేశారు. కప్పర్ల గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా కౌడల మహేందర్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ అనంతరం కౌడాల మహేందర్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి బాటలో కప్పర్లను ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రాథమిక వసతుల విస్తరణ, పల్లె ప్రగతి తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడు నడుంబిగిస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గండ్రత్ అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
