సాయిలింగి సాయి బాబా ఆలయంలో 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మన భారత్, తాంసి: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయి బాబా ఆలయ 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రజతోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకల్లో వేద పండితుల సాన్నిధ్యంలో దెబ్బడి అశోక్ దంపతులు గ్రామ ప్రజలతో కలిసి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడిన సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్ మాట్లాడుతూ, ఐదు రోజులపాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు కొనసాగనున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసామని వివరించారు.
సిల్వర్ జూబ్లీని గ్రామ ప్రజలు, భక్తులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు సేవకులు పాల్గొన్నారు.
